తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నింపాలని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య బిఎల్ఓలు,ఓటర్లకు సూచించారు.రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాలతో ఆదివారం అడ్వాలపల్లి,గాదంపల్లి గ్రామాల్లో సర్ పారాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బిఎల్ఓలు అందిస్తున్న ఎన్యూమ రేషన్ ఫారాలు, రిజిస్టర్ లో నమోదులు,యాప్ ఎంట్రీలను జాగ్రత్తగా చూడాలన్నారు. 2002 ఓటరు జాభితా ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉన్నదని తెలిపారు.
బూత్ స్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని అందులో ఉన్న వివరాలు నమోదు చేయాలని ఓటర్లకు అవగహన కల్పించారు.బూత్ స్థాయి అధికారి వద్ద ఓటరు జాభితా ఉంటుందని ప్రతి ఒక్కరు తమ పేర్లు పరిశీలించాలని తెలిపారు.జాబితాలో పరిశీలన అలాగే అనర్హులైన వారి పేర్లను తొలగించేందుకు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,రాహుల్,అడ్వాల మహేష్,శ్రీనివాస్, రాజు నాయక్,కిషన్ నాయక్,బూతు సిబ్బంది పాల్గొన్నారు.



