Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగాజలంతో దేవతామూర్తులకు అభిషేకం

గంగాజలంతో దేవతామూర్తులకు అభిషేకం

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం వీడీసీ ఆధ్వర్యంలో గంగాజలంతో దేవతామూర్తులకు అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు సూర్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రెండుసార్లు గంగాజల అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్, వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -