Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్‌లో మరోసారి భూకంపం

జపాన్‌లో మరోసారి భూకంపం

- Advertisement -

టోక్యో : జపాన్‌లో మరో సారి భారీ భూకంపం సంభవిం చింది. జపాన్‌ ఈశాన్య ప్రాంతం లోని ఇవాటే ప్రిఫెక్చర్‌ తీరంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు జపాన్‌ వాతావరణ శాఖ (జెఎంఎ) ఒక ప్రకటనలో తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమో దైంది. 41కి.మీ లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు తెలి పింది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జపాన్‌లోని ఇవాటే తీరం లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6గా నమోదైంది. వారం రోజుల పాటు 6 తీవ్రతతో భూమి కంపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -