Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతయ్య ఆశయాలను కొనసాగిస్తాం 

అంతయ్య ఆశయాలను కొనసాగిస్తాం 

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్ నాయక్
నవతెలంగాణ-అచ్చంపేట
మండల పరిధిలోని సింగారం గ్రామంలో కామ్రేడ్ అంతయ్య 34వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. సాటు అంతయ్య చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దేశ్య నాయక్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశనాయక్ మాట్లాడారు. పేదల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందించడానికి అంతన్న నిరంతరం పోరాటాలు చేసేవారని గుర్తు చేశారు.

అచ్చంపేట నల్లమల్ల ప్రాంతానికి ఎర్రజెండాకి వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి అంతన్న అని అన్నారు. నల్లమల్ల ప్రాంతంలోని ప్రజా సమస్యలపై అధికారులను, పాలకులను నిలదీసిన గొప్ప యోధుడని గుర్తు చేశారు. అంచలంచలుగా ఎదుగుతున్న ఎర్రజెండా వీరుడు అంతన్నను ఓర్వలేని నక్సలైట్లు హత్య హత్య చేశారని బాధను వ్యక్తం చేశారు. నక్సలైట్లు అంతన్నను చంపారు కానీ ఆయన ఆశయాలను చంపలేదని అన్నారు. అంతన్న ఆశయాలను కొనసాగించడానికి ఎంతోమంది ఎర్రజెండాలను పట్టుకొని ముందుకు వచ్చారని గుర్తు చేశారు.

ఆయన ఆశయాలు కొనసాగించడానికి మనమందరం ప్రజా ఉద్యమాలలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్ధం సైదులు, గ్రామ కార్యదర్శి బక్కయ్య, సీనియర్ కామ్రేడ్లు ఎస్. వెంకటయ్య, పర్వతాలు, బుచ్చయ్య, నరేష్, బచ్చయ్య, నారాయణ, రవి, శ్రీను,  పర్వతాలు, సుందరయ్య, రమేష్, లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -