- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మిడ్ డే మిల్స్ పథకం అమలును సర్పంచ్ సాయాగౌడ్, ప్రజాప్రతినిధులు తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



