Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంవీబీ గ్రామ్‌ ‌జీని ఉప‌సంహ‌రించుకోండి

వీబీ గ్రామ్‌ ‌జీని ఉప‌సంహ‌రించుకోండి

- Advertisement -

కేంద్రమంత్రి శివరాజ్‌‌సింగ్‌ చౌహాన్‌కు మంత్రి సీతక్క వినతి
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే నిబంధనలను సవరించాలి
రాష్ట్ర క్యాబినెట్‌లో ఈ చట్ట అమలుపై తుది నిర్ణయం

​‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వీబీ గ్రామ్‌ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ‌రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. ఈ చట్టం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌‌సింగ్‌ చౌహాన్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని పూసాలో అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం వీబీ గ్రామ్‌ జీ చట్టం అమలుపై శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీతక్క వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… వీబీ గ్రామ్‌‌జీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అభ్యంతరాలు, సూచనలను సమావేశం లో వివరించినట్టు చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను హక్కు ఆధారిత కార్యక్రమంగానే కొనసాగించాలని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతిపాదిత వీబీ గ్రామ్‌‌జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు.
కొత్త చట్టం గ్రామీణ పేదల పని హక్కును

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -