Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండెకరాల వరకే మొదటి విడత

రెండెకరాల వరకే మొదటి విడత

- Advertisement -

41.37 లక్ష‍ల మంది రైతులకు 2482.02 కోటక్ల జమ
వర్షాల నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు
హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా విడుదల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతు భరోసా నిధుల విడుదల యధావిధిగా కొనసాగుతుందనీ, మొదటి విడతలో రెండెకరాల వరకు 41.37 లక్ష‍ల మంది రైతులకు రూ.2482.02 కోట్లు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను హైదరాబాద్‌‌లోని శిల్పకళావేదికకు మార్చామనీ, ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌‌రెడ్డి హాజరవుతారని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు విత్తనాలు వేసే అత్యంత కీలక సమయంలోనే ప్రభుత్వం అందించే రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శిల్పకళా వేదికగా జరిగే కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి 2500 మంది రైతులు పాల్గొంటారనీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవంతం చేయాలని కోరారు.​
రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేస్తామనీ, అయితే, తొలి విడతలో ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండెకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందని వివరించారు. మిగిలిన రైతులకు కూడా దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీనిచ్చారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జులై ఐదో తేదీలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించినట్లయితే వారు కూడా రైతు భరోసా పొందే అవకాశం ఉంటుందనీ, కావునా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -