Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలుగువారు వ్యాపార రంగంలో ముందుండాలి

తెలుగువారు వ్యాపార రంగంలో ముందుండాలి

- Advertisement -

ఏపీ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త
అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం జాతీయ కార్యవర్గం ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ-మియాపూర్

తెలుగు వారు అన్ని వ్యాపార రంగాల్లో ముందుండాలని ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహర శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్త అన్నారు. ఆధునిక పరిశ్రమలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌లను స్థాపించడం ద్వారా, వర్ధమాన పారిశ్రామికవేత్తలుగా అద్భుతమైన ఆలోచనలను అభివృద్ధి చేసి, వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా మార్చడంలో సహాయపడుతాయని తెలిపారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్‌‌లోని హైటెక్‌ నోవొటెల్‌‌లో అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం జాతీయ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఆర్య వైశ్య ఇండస్ట్రియలిస్ట్స్ ఫోరం అనేది ఆర్య వైశ్య సమాజానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులను అనుసంధానించే ఒక జాతీయ వేదికగా ఏర్పడటం గర్వకారణమని అన్నారు. భవిష్యత్‌‌లో వ్యాపార రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్ష‍ించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేతల ఫోరం నూతన జాతీయ అధ్యక్షులుగా భవాని సురేష్ చారుగుండ్ల, ఉపాధ్యక్షులుగా బాలకృష్ణ ఎర్రం, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ పడకంటి, సంయుక్త కార్యదర్శిగా వంశీ నెలాంటి, కోశాధికారిగా శివ కుమార్ బొగ్గరితో సహా 47 మంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఫోరం పారిశ్రామిక ప్రదర్శన లోగో, బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్యెల్యే గణేష్ బిగల, పసుపు బోర్డు ఎండీ భవాని శ్రీ, సీఎం ఓఎస్‌‌డీ వేముల శ్రీనివాసులు, జీఎస్టీ కమిషనర్ సాయి కిషోర్, బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ కుమార్, టీపీసీసీ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్, టీజీవోఏ అధ్యక్షులు కృష్ణ మూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -