నూతన సిలబస్‌తో విద్యార్థులకు మెరుగైన భవిష్యత్
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.కిష్టారెడ్డి
నవతెలంగాణ – నక్కలగుట్ట
‘డిగ్రీ దండగ కాదు.. పండుగ’ అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.కిష్టారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హంటర్ రోడ్‌లోని మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన డిగ్రీ, పీజీ సిలబస్‌పై అధ్యాపకులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు దశాబ్దాలు విద్యారంగానికి అత్యంత కీలకమని అన్నారు. కాలానుగుణంగా కొత్త కోర్సులు, ట్రెండింగ్ సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నామని, అధ్యాపకులు నూతన సిలబస్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకుని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మెన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. అధ్యాపకులు ఎప్పటికప్పుడు సిలబస్‌లో వచ్చిన మార్పులను తెలుసుకుని విద్యార్థులను ఉద్యోగావకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన ప్రతిసారీ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కాకతీయ యూనివర్సిటీ ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. నూతన సిలబస్ రూపకల్పనలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ప్రోలరామ్, కళాశాల జనరల్ సెక్రటరీ సంగంరెడ్డి అచ్యుత్‌రాజ్, విశ్వరాజ్, ధనరాజ్, లక్ష్మీనరసింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, స్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ దండగ కాదు..పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



