బాగ్దాద్ : ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆదివారం బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబం ధాల బలోపేతం, ప్రాంతీయ భద్రత వంటి అంశా లపై ఆయనతో చర్చించారు. భద్రత, సుస్థిరతను ముందుకు తీసుకుపో యేందుకు చేపట్టాల్సిన ప్రాంతీయ చర్యలపై ఇరువురు నేతలు చర్చిం చారని ఇరాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఘర్ష ణల నివారణకు తీసుకుం టున్న దౌత్య పరమైన చర్యలను అల్-జైదీ స్వాగతించారు. చిరకాల శాంతి, సుస్థిరతల కోసం చర్చలు, రాజకీయ జోక్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల జరిగిన చర్చల గురించి ఇరాక్ ప్రధానికి అరాగ్చీ వివరించారు. భద్రతను బలోపేతం చేసేందుకు, జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేందుకు, దేశాల ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు చేపట్టాల్సిన సరిహద్దు అంతర్జాతీయ-ప్రాంతీయ ప్రయత్నాలు కూడా చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇరాక్‌కు ఇరాన్ మద్దతు కొనసాగుతుందని అరాగ్చీ పునరుద్ఘాటించారు. సహకారాన్ని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయాల్సిన, సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలు…ప్రాంతీయ భద్రతపై ఇరాక్ ప్రధానితో అరాగ్చీ చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



