Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంతీర్పు చెప్పిన జడ్జిపై విద్వేష దాడి!

తీర్పు చెప్పిన జడ్జిపై విద్వేష దాడి!

- Advertisement -

మూకదాడి కేసులో 14 మందికి యావజ్జీవం..
మహిళా న్యాయమూర్తి తబస్సుమ్‌ ‌ఖాన్‌ లక్ష్యంగా బెదిరింపులు

‘హిందూ వ్యతిరేకి’గా
దుష్ప్రచారం.. దిష్టిబొమ్మ దహనాలు..
బీజేపీ పాలిత మధ్య్రపదేశ్‌‌లో హిందూత్వ శక్తుల దుశ్చర్య
న్యాయవ్యవస్థ మీద దాడిపై న్యాయ నిపుణుల ఆందోళన

భోపాల్‌ : బీజేపీ పాలిత రాష్ట్రం మధ్య ప్రదేశ్‌లో హిందూత్వ శక్తులు రెచ్చిపోయా యి. న్యాయవ్యవస్థను సైతం బెదిరించేలా ఓ మహిళా జడ్జికి వ్యతిరేకంగా విద్వేషపూరిత చర్యలకు దిగాయి. 2022లో జరిగిన ఓ మూకదాడి (మాబ్‌ లించింగ్) కేసులో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి తబస్సుమ్‌ ఖాన్‌ను హిందూత్వ శక్తులు టార్గెట్‌‌గా చేసుకు న్నాయి. ఆమెపై మతపరమైన దుష్ప్రచారం చేశాయి. కాగా సదరు తీర్పును చట్టపరంగా సవాలు చేయకుండా, ఆమె ముస్లిం మతానికి చెందిన జడ్జి అనే కారణంతో హిందూత్వ సంస్థలు, గోరక్షక సంఘాలు, కాషాయ మూకలు సోషల్‌ మీడియా తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడులు, మత విద్వేష వ్యాఖ్యలు, బెదిరిం పులు చేస్తున్నాయని న్యూస్‌లాండ్రీ కథనం వెల్లడించింది. ఈ వ్యవహారం న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయమూర్తుల భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోందని న్యాయ నిపు ణులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​జూన్‌ 12న తీర్పు.. రెచ్చిపోయిన హిందూత్వ శక్తులు
నర్మదాపురం జిల్లా అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి తబస్సుమ్‌ ఖాన్ జూన్‌ 12న 2022లో జరిగిన మూకదాడికి సంబం ధించిన కేసులో 14 మందిని దోషులుగా తేల్చారు.
వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసు మహారాష్ట్రకు చెందిన ట్రక్‌ డ్రైవర్ షేక్‌ లాలా నజీర్‌ అహ్మద్ హత్యకు సంబంధించినది. అయితే ఈ తీర్పు తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారి పోయింది. హిందూత్వ శక్తులు మహిళా జడ్జి ని టార్గెట్‌ ‌చేశాయి. జడ్జి ముస్లిం కావడంతో ఈ కేసును హిందూ-ముస్లిం వివాదంగా మలచేందుకు ప్రయత్నిం చాయి. గోరక్షక సంఘాలు జడ్జిని ‘‘హిందూ వ్యతిరేకి’’గా అభి వర్ణిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో అవమానకర పోస్టులు చేశాయి. సుదర్శన్‌ న్యూస్‌ యజమాని సురేష్‌ చవ్హాంకే తన ఛానెల్‌లో ఈ తీర్పును ‘జ్యుడీషియల్‌ లిం చింగ్‌’గా అభివర్ణించారు. ‘గోరక్షకు లతో, వారి కుటుంబాలతో మేమున్నాం. ఇది వాళ్ల పో రాటం మాత్రమే కాదు, మనందరి పోరాటం’’ అని ఆయన ప్రసారంలో వ్యాఖ్యానించారు.

ఇతర రాష్ట్రాల్లోనూ కాషాయమూకల ​అసలు కేసు ఏమిటి?
ఈ కేసు 2022 ఆగస్టులో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతికి పశువులను తరలిస్తున్న ట్రక్‌లో… షేక్‌ లాలా నజీర్‌ అహ్మద్‌, షేక్‌ ముష్తాక్‌ తదితరులు ప్రయా ణిస్తు. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా సియోనీ మాల్వా తహసీల్‌ పరిధిలోని బరాఖడ్‌ గ్రామం వద్ద ట్రక్కును ఒక కాషాయ గుంపు అడ్డుకుంది. గో అక్రమ రవాణా జరుగు తోందనే అనుమానంతో ట్రక్కులోని వారిపై దాడి చేసింది. ఆ దాడిలో నజీర్‌ అహ్మద్‌ తీవ్ర గాయాలతో మరణించాడు. అయితే కోర్టు విచారణలో… ఈ 14 మంది ఒక గుంపుగా ఏర్పడి ఉద్దేశపూర్వ కంగానే దాడి చేసినట్టు తేలింది. వారిని భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్ష‍న్ల కింద దోషు లుగా నిర్ధారించింది. దాడి అత్యంత క్రూరమైన దని కోర్టు పేర్కొంటూ ఇది స్పష్టమైన మూక దాడి (మాబ్‌ ‌లించింగ్‌) కేసేనని తేల్చింది. పోస్టుమార్టం నివేదికలో… మృతుడి తలకు సహా శరీరంలోని అనేక భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నట్టు వెల్లడైంది.​

సోషల్‌ మీడియా ప్రచారంపై కేసు
జడ్జిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న విద్వేష ప్రచారం నేపథ్యంలో సియోనీ మాల్వా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఒక వైరల్‌ వీడియోలో వ్యక్తి మత విద్వేష వ్యాఖ్యలు చేస్తూ… తీర్పు వెనక్కి తీసుకోకపోతే ‘రక్తపాతం జరుగుతుంది’ అని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో దీనిని సుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ​

‘ఇలాంటి సందర్భాల్లో గతంలో సుమోటో చర్యలు తీసుకునేవారు’
జడ్జి కావడంతో కొన్ని నిబంధనలు, పరిస్థితుల దృష్ట్యా తబస్సుమ్‌ ఖాన్ ఈ విషయంపై స్పందించ లేకపోయారు. అయితే నర్మదాపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అడ్వకేట్‌ హజారీలాల్‌ గుర్జర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా జడ్జికి ప్రాణహానీ బెదిరింపులు వస్తున్నా.. ఆమె మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా.. హైకోర్టు ఇప్పటివరకు సుమోటోగా స్పందించకపోవడం ఆశ్చర్యకర మన్నారు. ఒక మహిళా న్యాయమూర్తిని లింగవివక్షతో కూడిన దూషణలకు గురిచేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కారానికి కూడా కారణమయ్యే అంశమని అభిప్రాయపడ్డారు.

ఆందోళనలు
ఈ నిరసనలు ఇప్పుడు మధ్యప్రదేశ్‌కే పరిమితం కాలేదు. జూన్‌ 22న మొహాలీలోని పీర్‌ ముచల్లాలో గోరక్ష పరిషత్‌ నిరసన చేపట్టింది. 14 మందిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ… జడ్జి తబస్సుమ్‌ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘తబస్సుమ్‌ ఖాన్ ముర్దాబాద్‌’, ‘గోరక్షకులను విడుదల చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. ఇక సోషల్‌ మీడియాలో తీవ్ర బెదిరింపులకు దిగారు. ఒక వీడియోలో వ్యక్తి జడ్జిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ… ‘రక్తపాతం జరుగుతుంది’ అని హెచ్చరించాడు. యూపీలోని లలిత్‌పూర్‌లో అంతర్జాతీయ హిందూ పరిషత్‌, రాష్ట్రీయ బజరంగ్‌ దళ్‌లు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. జడ్జి తీర్పును రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -