Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు స్కూల్ బస్సులు గ్రామంలోకి నో ఎంట్రీ

ప్రయివేటు స్కూల్ బస్సులు గ్రామంలోకి నో ఎంట్రీ

- Advertisement -

‘మన పిల్లలు.. మన ప్రభుత్వ బడుల్లోనే’
గ్రామసభలో విద్యాభివృద్ధిపై ఏకగ్రీవ తీర్మానాలు
నవతెలంగాణ – ఉప్పునుంతల 

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభ, బడిబాట, జల మహోత్సవ కార్యక్రమాలకు గ్రామ సర్పంచి సుప్రియ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా పలు కీలక తీర్మానాలు చేశారు.

గ్రామంలో నివసించే విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని గ్రామసభ పిలుపునిచ్చింది. అలాగే గ్రామానికి వెలుపల నుంచి వచ్చే ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

అనంతరం నిర్వహించిన జల మహోత్సవ కార్యక్రమంలో సర్పంచి సుప్రియ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వెల్టూర్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆంజనేయులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బలరాం నాయక్, డిప్యూటీ సర్పంచ్ భీమయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -