సీఎం ప్రజావాణిలో
క్రైస్తవ సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకర్గాల్లో సమాధుల స్థలం లేకపోవడంతో క్రైస్తవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు క్రైస్తవ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణిలో డాక్టర్ మార్టిన్ లూథర్ కాన్సెప్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య, ఉపాధ్యక్షులు ఎం.వి.జాన్సన్ దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బిషప్ ఎం.సామ్యేల్ లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్ పేట్ తదితర నియోజకవర్గాల్లో సమాధులు లేవని వారు తెలిపారు. క్రైస్తవుల సమాధులకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలనీ లేదా అన్ని స్మశాన వాటికల్లో అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఫారూఖ్ నగర్ మండలం చౌలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఐదు నియోజకవర్గాల ఉమ్మడిగా కేటాయించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. వివాదం లేని స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
క్రైస్తవులకు సమాధుల స్థలాలు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



