Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తక్షణమే ఉద్యోగాల నియామకాలు భర్తీ చేపట్టాలి 

తక్షణమే ఉద్యోగాల నియామకాలు భర్తీ చేపట్టాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
తక్షణమే 20,000 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల నియమకాలు భర్తీ చేపట్టాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. పట్టణ  కేంద్రంలో స్థానిక లైబ్రరీ భవనం ముందు గురువారం మాట్లాడుతూ విద్యార్థి సేన నాయకులు, నిరుద్యోగ యువతి యువకుల ప్రభుత్వం 19,000 ఎస్సై కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయని చెప్పి కేవలం ఐదు వేలకే మొదట నిమకాలు ప్రారంభిస్తామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ ఎన్నికల హామీలో రెండు లక్షల తోటి జాబ్ క్యాలెండర్ వేస్తామని విద్యార్థులని నిరుద్యోగులని మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడ్డాక హామీలను తుంగలో తొక్కేశారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే వారి యొక్క డిమాండ్పై ఏమాత్రం అవగాహన ఉన్న 20వేలతో ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ దుర్గాప్రసాద్ అంజి రవి నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -