- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలోని అంగన్వాడి చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను ఆ గ్రామ సర్పంచ్ మాధవరావు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారి పిల్లలకు విద్య అభివృద్ధి తో పాటు మంచి పౌష్టికాహారం సరఫరా చేస్తోందన్నారు. చిన్నారులకు తప్పనిసరిగా అందించాలని సూచించారు. చిన్నారులను తలిదండ్రులు అంగన్వాడీలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఆ గ్రామ పెద్దలు రాజు పటేల్, చిన్నారి పిల్లల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -



