- Advertisement -
నవతెలంగాణ-పెద్దవంగర
మండల కేంద్రానికి చెందిన కల్లు గీత కార్మికుడు అనపురం వెంకట నారాయణ (53) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. వెంకట నారాయణ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఆయనకు భార్య లలిత, ఇద్దరు కుమారులు జగదీష్, శ్రీకాంత్ ఉన్నారు.
- Advertisement -


