నాలుగు నుంచి ఐదెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ
ఇప్పటివరకు 65.76 లక్షల మంది రైతులకు రూ.6590.37 కోట్ల రైతుభరోసా సాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుభరోసా పథకం కింద నాలుగో విడతలో నాలుగు నుంచి ఐదెకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను శుక్రవారం రాష్ట్ర సర్కారు జమ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు మొత్తంగా ఈ సీజన్‌లో రైతుభరోసా పథకం కింద 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు.



