Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం11 ఏండ్ల బాల కార్టూనిస్టు శ్రీయాన్ శ్రీరంగంను అభినందించిన కేటీఆర్

11 ఏండ్ల బాల కార్టూనిస్టు శ్రీయాన్ శ్రీరంగంను అభినందించిన కేటీఆర్

- Advertisement -


‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
​11 ఏండ్ల బాల కార్టూనిస్టు శ్రీయాన్ శ్రీరంగంను బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో కేటీఆర్‌‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చిన్న వయసులోనే ఆయన గీసిన అద్భుతమైన కార్టూన్లను కేటీఆర్ తిలకించారు. ఏడేండ్ల వయసులోనే శ్రీయాన్‌ కార్టూన్లు గీయడం ప్రారంభిం‌చారు. తన ఉత్తమ కార్టూన్లతో ‘బ్రోచేవారెవరు బ్రో.. నను’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించడం విశేషమని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీయాన్‌ను అభినందించిన కేటీఆర్, అతని ప్రతిభ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలనీ, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -