Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅదృశ్యమైన గురుకులం విద్యార్థి ఆచూకీ లభ్యం

అదృశ్యమైన గురుకులం విద్యార్థి ఆచూకీ లభ్యం

- Advertisement -

24 గంటల్లోపే ఆచూకీ కనుగొన్న పోలీసులు
తల్లిదండ్రులకు అప్పగింత
నవతెలంగాణ- చెన్నూర్‌టౌన్‌

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్నారు. తల్లిదండ్రులకు అప్పజెప్పారు. చెన్నూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి దుర్గం హర్ష గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎవరికీ చెప్పకుండా గురుకుల పాఠశాల నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమై బాలుడి కోసం చుట్టుపక్కల గాలించింది. సాయంత్రం వరకు కూడా ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపల్‌ రాత్రి 9 గంటల సమయంలో బాలుడి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో సైతం చక్కర్లు కొట్టింది. బాలుడు కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు బస్సులో వెళ్తున్న క్రమంలో ఓ ప్రయాణికుడు గుర్తించి సమీపంలోని కేవశపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును ఆపి బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకుని చెన్నూర్‌ పోలీసులకు తెలియజేశారు. అనంతరం వారు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -