Monday, March 2, 2026
E-PAPER
Homeజాతీయంఖమేనీ మృతి..క‌శ్మీర్‌లో నిర‌స‌న‌లు

ఖమేనీ మృతి..క‌శ్మీర్‌లో నిర‌స‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్, యూఎస్ సంయుక్త దాడుల‌తో ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ఆదివారం భారత్‌లో తీవ్ర ఆగ్రహం, సంతాపం వ్యక్తమైంది. కశ్మీర్‌ మొదలుకొని కర్ణాటక వరకు పలు రాష్ర్టాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 15 లక్షల షియా ముస్లింలు ఉన్న కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బుద్గాం, బందిపొరా, అనంత్‌నాగ్‌, పుల్వామాలో షియాలు గుండెల మీద బాదుకొంటూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఇరాన్‌లోని తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరారు. యూపీలోని లక్నో, అజ్మీర్‌లోనూ నిరసనలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 1986లో ఖమేనీ సందర్శించిన ఓ గ్రామంలో స్వచ్చందంగా దుకాణదారులు షాపులను మూసివేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని గ్రామస్థులు నిర్ణయించారు. న్యూఢిల్లీ, బీహార్‌, జార్ఖండ్‌, తెలంగాణలో తీవ్ర ఆందోళనలు, నినాదాల దృశ్యాలు కనిపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -