Sunday, July 5, 2026
E-PAPER
Homeఖమ్మంజర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యను పరిష్కరిస్తాం

జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యను పరిష్కరిస్తాం

- Advertisement -

– సత్తుపల్లి జర్నలిస్టు జేఏసీ నాయకులకు హామీ ఇచ్చిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి 

ప్రింట్ మీడియాలో నియోజకవర్గ కేంద్ర ఇన్చార్జిలుగా (ఆర్సీ) పనిచేస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి జర్నలిస్టు జేఏసీ నాయకులకు  హామీ ఇచ్చారు. సత్తుపల్లిలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి సత్తుపల్లికి వచ్చిన  మంత్రి పొంగులేటిని సత్తుపల్లి జర్నలిస్టు జేఏసీ నాయకులు కలిసి అక్రిడిటేషన్ సమస్య పరిష్కారించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.  నియోజకవర్గ కేంద్రంలో సుదీర్ఘకాలంగా జిల్లా కార్డులు పొందుతున్న ఇన్చార్జిలకు, ప్రస్తుత ప్రక్రియలో హోదా తగ్గించి మండల కార్డులు జారీ చేశారని మంత్రికి వివరించారు.

మండల  కార్డులను రద్దు చేసి, తమకు యథావిధిగా జిల్లా అక్రిడిటేషన్ కార్డులను పునరుద్ధరించాలని వారు కోరారు. అలాగే మున్సిపల్, నగరపాలక కేంద్రాల్లో పట్టణ, రూరల్, వివిధ డేట్ లైన్లతో పనిచేస్తున్న విలేకరులకు ఈసారి కార్డులు నిలిపివేయడంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి, ఈ అక్రిడిటేషన్ సమస్యను వెంటనే పరిశీలించి తగిన న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటితో పాటు కలెక్టర్ దివాకర్ టీఎస్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కు  సత్తుపల్లి జర్నలిస్టు జేఏసీ నాయకులు వినతి పత్రాలు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -