– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల నమోదును వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అయినా మండలంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల నమోదుపై మండల రిపోర్ట్స్ పరిశీలన చేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గల ఎన్యుమరేషన్ పత్రాల నమోదులో కమ్మర్ పల్లి , ఉప్లూర్, చౌట్ పల్లి గ్రామాల్లో తక్కువగా ఉన్నందున నమోదును చేయాలని తహసిల్దార్ నరేష్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియకు ప్రజలు సహకరించాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలను బూత్ లెవెల్ అధికారులకు త్వరగా అందజేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులు కూడా ఎన్యుమరేషన్ పత్రాలను ఆన్ లైన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తాపీ వద్దని సూచించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్యుమరేషన్ పత్రాల నమోదును వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



