మాకినేని బసవపున విజ్ఞాన కేంద్రం – సాహితీ స్రవంతి సంయుక్తంగా విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 11, 12 వ తేదీలలో రెండు రోజులపాటు సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నది. ఈ సభలో డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ గుంటూరు లక్ష్మీ నరసయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, తెలకపల్లి రవి, ఖాదర్ మొహీయుద్దీన్, అట్టాడ అప్పలనాయుడు, మహమ్మద్ ఖదీర్ బాబు, ఆర్ సీతారాం, గంటేడు గౌరు నాయుడు, ఎంవిఎస్ శర్మ, పిన్నమనేని మురళీకృష్ణ , కే. సత్యరంజన్ ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగానే ప్రసిద్ధ సాహితీవేత్తలతో యువకులు రచయితల ప్రశ్నోత్తరాల కార్యక్రమం వుంటుంది. ఈ సాహిత్య సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల్లోని కవులు రచయితలు హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.
తెలంగాణ సాహితి ఆహ్వానం
తెలంగాణ సాహితి హైదరాబాద్ నగర కమిటీ ఈ నెల 11న మధ్యాహ్నం 1.30 గంటలకు కవిత్వ కార్యశాల త్యాగరాయ గాన సభలో నిర్వహిస్తుంది. ఈ సభలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి గారు స్థాపించిన గోలకొండ పత్రిక కు వందేళ్లు నిండిన సందర్భంగా, తెలంగాణ సాహితి తీసుకొచ్చిన “గోలకొండ కలాలు” పుస్తక పరిచయ సభ జరుగుతుంది. ఇందులో ఏభూషి నరసింహ, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహ రెడ్డి(IAS), కె.ఆనందాచారి, నందిని సిధారెడ్డి, సి.హెచ్. ఉషారాణి, శరత్ సుదర్శి, మేరెడ్డి రేఖ, గంగాధర్, శ్రీసుధ కొలచన, కొండ రవీందర్, శ్రీలత ధావన్, హరిప్రియ పాల్గొంటారు.
కెంగార మోహన్, 9493375447


