- Advertisement -
– విద్యుత్ సిబ్బందికి సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట
లైన్మెన్ ఆవాస్ దినోత్సవాన్ని బుధవారం ఎన్పీడీసీఎల్ అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలో అశ్వారావుపేట ఏడీఈ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏడీఈ బి. వెంకటరత్నం ఆధ్వర్యంలో అశ్వారావుపేట సెక్షన్ పరిధిలోని లైన్ ఇన్స్పెక్టర్,లైన్మెన్, ఏఎల్ఎమ్,ఇతర సిబ్బందిని సన్మానించారు.
ఈ సందర్భంగా వృత్తి పరమైన ప్రతిజ్ఞ అనంతరం వృత్తి లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పని ప్రదేశంలో అప్రమత్తత లను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కే.వెంకటేశ్వర్లు,ఎస్.ఈ ఎం.శివ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



