Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

• 150 మందికి ఆరోగ్య పరీక్షలు
• ఉచితంగా మందుల పంపిణీ
• బాల వికాస సేవలు అభినందనీయం: సర్పంచ్ పారిజాత 
నవతెలంగాణ -పెద్దవంగర
పెద్దవంగర గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో తొర్రూరు మెడికేర్ ఆస్పత్రి సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ కోట నరేష్, రాము ఆధ్వర్యంలో గ్రామస్తులకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం 150 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో బాల వికాస అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. బాల వికాస సెంటర్ మేనేజర్ వై. రమా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

అనంతరం గ్రామంలో శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి రావడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ ను కోరారు. కార్యక్రమంలో బాల పంచాయతీ కార్యదర్శి వెంకన్న, ఉపసర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, బాల వికాస ప్రతినిధులు శైలజ, ఎం. శోభా, విలేజ్ లీడర్ బి. రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -