- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన తిరుమణి రామచంద్రం సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్,వార్డు సభ్యులు ఝాన్సీ రాణి నరసింహ,బేదపూడి వెంకటేశ్వర్లు,బుర్కల లక్ష్మయ్య,తిరుమణి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



