నవతెలంగాణ – కాటారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కాటారం మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంతా కలిసి కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచారు. కార్యాలయ ప్రాంగణంలోని చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయాలు శుభ్రంగా ఉండాలని సిబ్బంది తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అందరూ సమిష్టిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



