- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మీషోకు ఆదాయ పన్ను శాఖ రూ.1500కోట్ల పన్ను డిమాండ్ నోటీసు పంపింది. 2023-25 మదింపు సంవత్సరానికి గానూ ఈ మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని మీషో పేర్కొంది. ఈమేరకు మార్చి 7న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. ఈ డిమాండ్ నోటీసు.. తమ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పొజిషన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపదని పేర్కొంది.
- Advertisement -



