మంటలంటుకొని యాక్టివా దగ్ధం

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
ఆలేరు పట్టణంలో భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద యాక్టివా వాహనం మంటలంటుకొని దగ్ధమైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మంటలా అంటుకున్న సంఘటన గురించి స్థానికులు ఫైర్‌ స్టేషన్కు సమాచారం అందించగా ఫైర్‌ సిబ్బంది సంఘటన వద్దకు చేరుకొని మంటలను ఆర్పారు. బంకు సమీపంలోనే అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు, పెట్రోల్‌ బంక్‌ వారు ఆందోళన చెందారు. పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాద నివారణకు ఎలాంటి చర్యలు లేవని వాహనదారులు ఆపోతున్నారు. పెను ప్రమాదం తప్పినట్లు అయిందని వాహనదారులు చర్చించుకున్నారు.

Spread the love