భీంసారిగ్రామంలో ఒకచోట నిలిపివున్న రాతిస్తంభానికి నలువైపుల చెక్కిన అర్థశిల్పాలలో బుద్ధనిర్వాణ శిల్పముండడాన్ని గమనించాడు కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు, చరిత్రోపన్యాసకుడు రొడ్డావార్ పృథ్వీరాజ్. ఈ శిల్పస్తంభాన్ని పరిశీలించిన చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ‘శయనించివున్న బుద్ధుడు కుడివైపుతిరిగి పడుకున్నాడు, కుడిచేయిని తలాపుగా పెట్టుకున్నాడు. ఇది ‘పరినిబ్బానసుత్త’లో వివరించినట్లు బుద్ధనిర్వాణ శిల్పమే’ నన్నారు. ఈ శిల్పాన్న చూసిన స్థపతి, చరిత్రకారులు డా. శివనాగిరెడ్డిగారు ‘బుద్ధనిర్వాణ శిల్పమేనని నిర్ధారించారు. గతంలో వేములవాడ భీమేశ్వరాలయం అధిష్టానం మీద, ముదిగొండలో లభించిన పాలరాతి ఫలకం మీద తెలంగాణాలో బుద్ధనిర్వాణ శిల్పాలు లభించాయని వివరించారు. తక్కిన మూడింటిలో ఒకటి విష్ణుశయనమూర్తి, రెండు ఖడ్గధారి రాజోచిత ఆహార్యంతో వీరుడు, మూడు ఉమాలింగనమూర్తి అర్ధశిల్పాలున్నాయి. విభిన్నమైన ధర్మశిల్పాలు ఒకే రాతిస్తంభం మీద చెక్కడం అపూర్వం. ఇటువంటి శిల్పస్తంభం తెలంగాణాలో మొదటిసారిగా కనిపించింది.
క్షేత్రపరిశోధన, ఫొటోగ్రఫీ: శ్రీరామోజు హరగోపాల్,
ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు,
కొత్త తెలంగాణ చరిత్రబృందం, 9949498698
ఆదిలాబాద్ జిల్లా భీంసారిలో బుద్ధ పరినిర్వాణ శిల్పం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


