ప్రభుత్వానికి అసోసియేషన్ విజ్ఞప్తి
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి అవగాహన సదస్సులు
మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం లోని గ్రూప్ 1 సర్వీస్ అధికారులతో స్టేట్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్ల అసోసోయేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. శనివారం తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆన్ లైన్ ద్వారా జరిగింది . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గ్రూప్ 1 ఆఫీసర్లకు ఆయా శాఖలలో, కార్పొరేషన్లలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖ లలోని సీనియర్ అధికారులను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఐ ఏ ఎస్ పదోన్నతులలో స్టేట్ సివిల్ సర్వీస్ శాఖగా కేవలం రెవిన్యూ శాఖనే పరిగణించడం వల్ల గ్రూప్ 1లోని ఇతర శాఖల అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని గుర్తుచేశారు. కేరళ , ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన తరహాలో తెలంగాణలో సైతం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని శాఖల్లోని గ్రూప్ 1 అధికారులకు టైమ్ బౌండ్ పదోన్నతులు కల్పించాలనీ,, , గ్రూప్ 1 లోని అన్ని సర్వీసులకు సమాన వేతనాలు ఉండేలా చూడాలని కోరారు. గ్రూప్ 1 ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. త్వరలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని, ఇతర సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్ళాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్, ఇతర గ్రూప్ 1 అధికారులు సయ్యద్ యాసిన్ ఖురేషి, అరవింద రెడ్డి, శశిధరా చారి, హరికిషన్, భవాని, రమేష్ కుమార్, సోమ శేఖర్, పద్మజ, మైత్రి ప్రియ మరియు నూతనం గా ఎంపికైన 2025 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్లతో పాటు వివిధ శాఖలకు చెందిన 300 కు పైగా గ్రూప్ 1 అధికారులు పాల్గొన్నారు .
తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



