Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ నిర్వాసితులకు న్యాయం చేయాలి

మూసీ నిర్వాసితులకు న్యాయం చేయాలి

- Advertisement -

పునరావాసం, సరైన నష్టపరిహారం 
తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలి
మూసీలోకి పారిశ్రామిక 
వ్యర్థాలను అరికట్టాలి
ప్రతి ఊరిలోనూ కట్టలు,  చెరువులు మాయం : 
రౌండ్‌ ‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ-అంబర్‌పేట

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అమలుకు ముందు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి, సరైన నష్టపరిహారం చెల్లించాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక తరగతుల నాయకులు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో శనివారం టీఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన మూసీ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గంలో మూసీ ప్రభావిత కుటుంబాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు, హైడ్రా చర్యలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రయినేజీ నీటి వల్ల మూసీ కాలుష్యం అయిందని తెలిపారు. వాటిని అరికట్టి.. మరిన్ని ఎస్టీపీలను ఏర్పాటు చేయడం, క్యాచ్‌మెంట్ ప్రాంతాల పునరుద్ధరణ, నిర్వాసితులకు పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బాధితులకు సరైన నష్టపరిహారం అందించిన తర్వాతే ఇండ్లను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ మాట్లాడుతూ.. రూ.1.50 లక్షల కోట్ల అంచనాతో ప్రాజెక్టు చేపట్టే ముందు ఆర్థిక వనరులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించక పోవడాన్ని ప్రశ్నించారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నిర్వాసితులకు పునరావాసం, తగిన నష్టపరిహారం, ప్రజాసంఘాలు లేవనెత్తిన సందేహాల నివృత్తి అనంతరమే మూసీ ప్రాజెక్టును అమలు చేయాలని కోరారు.

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి ఊరిలోనూ కట్టలు, చెరువులు మాయమైపోయాయని, మైసమ్మలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వరదలతో ప్రవహించిన మూసీ నది నేడు మురికికూపంగా మారిందన్నారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోషియల్ ట్రీట్మెంట్ ప్లాంట్లు విరివిగా నెలకొల్పాలని, పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి వదలకూడదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వర్ణాల శ్రీరాములు మాట్లాడుతూ.. అందరూ మూసీ పునర్జీవ ప్రాజెక్టును స్వాగతిస్తున్నప్పటికీ, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా సాధ్యాసాధ్యాలపై చర్చించడం కష్టమన్నారు. ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, మాజీ ట్రైకార్ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్, మన్నారం నాగరాజు తదితరులు మూసీ పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, పర్యావరణ పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో వ్యక్తమైన సూచనలు, అభిప్రాయాలను సమగ్ర నివేదికగా రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎల్‌డీ ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, విశాల్, ఓంకార్ నరసింహారావు, రిషభ్ జైన్, బుల్లెట్ వెంకన్న, రాజ్‌కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, విక్రమ్, బేగ్, కిరణ్, మల్లేష్ గౌడ్, మాడు సత్యం గౌడ్, కర్నాటి మనోహర్, రాంప్రసాద్, సుధాకర్ రెడ్డి తదితర నాయకులు, సామాజికవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -