Monday, July 13, 2026
E-PAPER
Homeదర్వాజదుర్ఘటన

దుర్ఘటన

- Advertisement -


వాడు దొరకాలి గానీ
బండకేసి ఉతకాలి
కళ్ళు డిక్కీలో పెట్టుకుని పోతున్నట్టు
నాలుగు పయ్యల యమపాశమై
రెండు కాళ్ళ మనిషిని
పులి ఈడ్చుకుని పోయినట్టు పోయిండు
బలుపు గాడిద చెవులు పీకి చేతిల వెట్ట
పాపం వలస కార్మికుడు
అన్యాయమయ్యిండు
ఇంటి దగ్గర ఎంత చెప్పి వచ్చిండో
తిరిగి వస్తానని
నమ్మకం ఎలా బోధించిండో
తీపి తీపి కలలు మోసుకొస్తానని
ఏమి హామీ ఇచ్చిండో
ఎక్కడ పుట్టిండో
ఇక్కడ ఆగమయ్యిండు
రోడ్డెక్కితే నెత్తుటి మరక
గుండెను మెలిపెడుతున్నది
ఉండలు ఉండలుగా గడ్డ కట్టిన
దుఃఖం
బొట్లు బొట్లుగా రాలుతున్నది
లోపల శిశిరమేదో ఆవహించినట్టు
పండుటాకులా కురుస్తున్నది
ఆడుతూ పాడుతూ
బడికి నడిచి పోయే పిల్లలు యాదికొస్తే
భయం గాండ్రింపులకు
వొళ్ళు వొణికి పోతున్నది
ఊరడింపు మాటలు ఎన్ని చెప్పూ
మనసు లోని వెన్నతనం కూడా
పెద్ద శాపమే.
గజ్జెల రామకృష్ణ, 8977412795

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -