Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంయాత్రికుల బస్సు బోల్తా

యాత్రికుల బస్సు బోల్తా

- Advertisement -

16 మందికి గాయాలు
కాంగ్రా
: అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళుతున్న బస్సు బోల్తా పడటంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లేందుకు యాత్రికులు ఈ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నట్టు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -