– నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దళిత బహుజన పార్టీ (డిబిపి) పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జిగా ఎన్.రాంచందర్‌ను నియమించినట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలిపారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఎన్.రాంచందర్‌కు నియామకపత్రం అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయం పొలిటికల్ పవర్ సాధన కోసం ఎన్నికల రాజ కీయ పోరాటం ఎన్.రాంచందర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దోపిడీ కులాల పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లను రాజకీయంగా ఓడించకపోతే దళిత జాతు లకు భవిష్యత్ లేదన్నారు. రాజ్యాధికారం సాధన ద్వారానే సామాజిక న్యాయం, రక్షణ, విముక్తి కలుగుతుందన్నారు. పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి రాంచందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియో జకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దళిత బహుజన పార్టీ తరుపున అభ్యర్థులు పోటీ చేయిస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ సందేశ్ యాత్రలో భాగంగా రాజ్యాధికార చైతన్య ర్యాలీని జూన్ 24న పెద్ద పల్లిలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. కరుణాకర్, పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్షులు దాసరి రవికుమార్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.