Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి.. స్థానికుల సందర్శన

రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి.. స్థానికుల సందర్శన

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
అలేరు రైల్వే గేట్ వద్ద నిర్మించిన అండర్‌పాస్ బ్రిడ్జి పనులు పూర్తయిన సందర్భంగా ఆలేరు పట్టణ నాయకులు మంగళవారం సందర్శించారు. అండర్‌పాస్ నిర్మాణం వల్ల ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలు ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలిగింది. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలనీ, ఇదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ అలేరును ఆదర్శ పట్టణంగా ఎందుకు పాలకులు కృషి చేయాలని  స్థానిక నాయకులు, ప్రజలు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -