- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్ పాసిఘాట్‌లోని మీబో & సిగార్ అడువుల్లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలు కిలో మీటర్లు మేర మంటలు వ్యాపించడంతో చెట్లు దగ్ధమైయ్యాయి. భారీ యోత్తున ఎగిసి పడుతున్నదట్టమైన మంటలను గమనించిన ఫారెస్ట్ అధికారులు..ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆర్మీకి చెందిన Mi-17 V5 హెలికాప్టర్‌ను రంగంలోకి దింపారు. 66,000 లీటర్ల నీటిని వినియోగించి పెద్ద మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చినట్లు ఎక్స్ వేదికగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
- Advertisement -



