Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం

నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలను సొంతం చేసుకున్న పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను పరకాల సీఐ వి.క్రాంతి కుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి వేదికగా ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సుజాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్, వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్, యుషు గేమ్‌లో సిల్వర్ మెడల్ మరియు బాక్సింగ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించి పోలీస్ శాఖకు, పరకాల ప్రాంతానికి పేరు తెచ్చారు. ఈ సందర్భంగా గురువారం పరకాల పోలీస్ స్టేషన్‌లో సుజాతను ప్రత్యేకంగా అభినందించిన సీఐ క్రాంతి కుమార్, ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ టి.సర్వన్, కానిస్టేబుల్ రాజయ్య, మహిళా కానిస్టేబుల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -