నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో కొనసాగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా పది రోజులుగా గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని మురికి కాలువలలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ గ్రామాన్ని పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గ్రామ ప్రజలు కూడా తమ వంతుగా సహకారాన్ని అందించాలని కోరారు. చెత్తాచెదారాన్ని మురికి కాలువల్లో వేయొద్దని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని గ్రామస్తులకు సూచించారు.
శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



