- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా. చిన్నతడు గ్రామ సర్పంచ్ సూర్య వంశి ప్రకాష్ లు సంయుక్తంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ కమిటీ చైర్మన్ గా ఇటీవలే ఎమ్మెల్యే నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులతో పాటు సర్పంచులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, యూత్ మండల అధ్యక్షులు హనుమంతు యాదవ్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, యువ నాయకులు కృష్ణ పటేల్, తుల సంతోష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



