– టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామంలో పార్టీ బలోపేతం కావాలన్నా యువకుల పాత్ర కీలకమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని అన్నారం గ్రామానికి చెందిన యువకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, పార్టీ బలోపేతం, యువత పాత్ర, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నారం యూత్ సభ్యులు పంక శివరాజు, కుక్కల రాజు, గడ్డమీద శంకర్, కిసారి ప్రవీణ్, బలరాం, రాజశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.



