Sunday, July 19, 2026
E-PAPER
Homeసోపతిపొంగుతున్న నిమ్మకాయ

పొంగుతున్న నిమ్మకాయ

- Advertisement -

కావలసిన వస్తువులు: నిమ్మకాయలు, డిష్‌ వాష్‌ లిక్విడ్‌, బేకింగ్‌ సోడా, ఫుడ్‌ కలర్‌, ఫోర్క్‌.
ప్రయోగం చేయు విధానం: ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా! బాగా పండిన రసభరితమైన నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను రెండు సమాన భాగాలుగా కోయాలి. ఒక నిమ్మకాయను ఫోర్క్‌ సహాయంతో లేదా పదునైన వస్తువుతో గుచ్చుతూ నిమ్మకాయను జ్యూసీగా చేసుకోవాలి. మిగతా సగం నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ మీద ఫుడ్‌ కలర్‌ చల్లి, డిష్‌ వాష్‌ లిక్విడ్‌ పోసుకోవాలి. అలాగే దాని మీద బేకింగ్‌ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత గ్లాసులో ఉన్న నిమ్మరసాన్ని పోసి ఏం జరుగుతుందో గమనించండి.
ప్రయోగ వివరణ: ఫుడ్‌ కలర్‌, డిష్‌ వాష్‌ లిక్విడ్‌, బేకింగ్‌ సోడా మిశ్రమం ఉన్న నిమ్మకాయ మీద నిమ్మ రసం పోసినప్పుడు నిమ్మకాయ పొంగుతుంది. ఇక్కడ నిమ్మకాయలో ఉన్న సిట్రిక్‌ ఆమ్లం, బేకింగ్‌ సోడా చర్య జరిపి కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువును విడుదల చేస్తాయి. దానివల్ల నిమ్మకాయ పొంగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ డిష్‌ వాష్‌ లిక్విడ్‌ పొంగు బాగా వచ్చేటట్టు చేస్తుంది. ఫుడ్‌ కలర్‌ ప్రయోగం ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. ఈ ప్రయోగం ద్వారా మనకు నిమ్మరసంలో ఆమ్లాలు ఉంటాయని తెలుస్తుంది. అదేవిధంగా ఆమ్లం బేకింగ్‌ సోడాతో చర్య జరిపినప్పుడు కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు విడుదల అవుతుందని తెలుస్తుంది.

వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -