రమణమూర్తిపై దాడిచేసిన మతోన్మాది కశ్యప్రెడ్డిని అరెస్టు చేయాలి
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన
నవతెలంగాణ – ముషీరాబాద్
హిందూ ధర్మం వేరు.. మతోన్మాదులు వేరని, టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త రమణమూర్తిపై దాడి చేసిన కశ్యప్రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సుమారు 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి మాట్లాడుతూ.. రమణమూర్తిపై దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడం ఆందోళనకరమన్నారు. దాడి ఘటనను సుమోటోగా స్వీకరించి నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవతలను కించపరిచే వైఖరి తీసుకుంటు న్నాయన్నారు. మతం ఒక ధర్మం, విశ్వాసంతో కూడుకున్నదన్నారు. రాజకీయాల్లో దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచిం చారు. మతం వ్యక్తిగత స్వేచ్ఛగా ఉండాల్సిన స్థానంలో వ్యవస్థలోకి, రాజకీయాల్లోకి, పరిపాలనలోకి జొప్పించడం ద్వారా మతోన్మాద దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. టి. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. ఈ ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా పరిగణిం చాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని సూచించారు. హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిం చాలన్నారు. రమణమూర్తి మాట్లాడుతూ.. హిందూ మతంలో ఆర్ఎస్ఎస్ లాంటి విషపురుగులు చేరాయని, వారిది వినాశన ధర్మం అయితే.. జై భారత్ సంస్థది సనాతన ధర్మమని చెప్పారు. హిందూ మతంలో విద్వేషం ఉన్మాదం లేదని, విమర్శకు స్థానం ఉందని అన్నారు. అయోధ్య రామ మంది రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించి నందుకే తనపై దాడి జరిగిందన్నారు. జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ.. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను అరికట్టాలని, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు. టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రచయితలు, పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులపై భౌతిక దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి ఎం.శోభన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, ప్రముఖ న్యాయవాది డాక్టర్ లూనా సర్వత్, వివిధ ప్రజా, సామాజిక, ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



