Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ బిఎల్ఓకు ఎన్యుమరేషన్ ఫారాల అందజేత 

 బిఎల్ఓకు ఎన్యుమరేషన్ ఫారాల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సార్ ప్రక్రియ కేంద్రంలో సోమవారం ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తమ కుటుంబ సభ్యుల ఎన్యుమరేషన్ ఫారాలను బిఎల్ఓ వరలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్  మాట్లాడుతూ ఓటర్లకి బిఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు అందించారని వాటిని తిరిగి ఓటర్లు వారి వివరాలతో పూరించి తిరిగి బిఎల్ఓ లకు అందించాలని, లేనిపక్షంలో తమ ఓటు ముసాయిదా ఓటర్ జాబితా నుండి తొలగించబడుతుందని తెలిపారు. గడువు తేదీ ఆగస్టు 3 వరకు ఉందని చివరి తేదీ అని చూడకుండా ముందుగానే ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారలను బిఎల్వోలకు డిజిటలైజేషన్ చేయించుకోవాలని కోరారు. ఈఆర్ ఫౌండేషన్ తరపున ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుమంత్, మున్సిపల్ బిల్ కలెక్టర్ నళిని, ఫౌండేషన్ ప్రతిదులు రాంప్రసాద్, అర్గుల్ సురేష్,  కె.వి రమణ, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -