Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇప్పపువ్వు సారాను మార్కెట్లోకి తీసుకురావాలి

ఇప్పపువ్వు సారాను మార్కెట్లోకి తీసుకురావాలి

- Advertisement -

తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతి రామ్ నాయక్ 
నవతెలంగాణ – కామారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇప్పపువ్వు (మహువా) సారాను మార్కెట్లోకి తీసుకురావాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతి రామ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పపువ్వుతో తయారయ్యే సారా ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి వైద్యంగా గిరిజనులు వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం ప్రకారం గిరిజనులు ఆరు లీటర్ల వరకు సారాను కాచుకునే హక్కు కూడా కల్పించబడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం గుడుంబా పేరుతో అలాంటి సంప్రదాయ సారాను గిరిజనుల నుంచి దూరం చేసి, ప్రభుత్వం చీప్ లిక్కర్లకు ప్రజలను అలవాటు చేసిందని ఆరోపించారు. దీని వల్ల అనేక మంది వివిధ రోగాలతో బాధపడుతూ 40 – 50 సంవత్సరాలకే మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఇప్పపువ్వు చెట్లను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి, ఇప్పపువ్వు సారాను గిరిజనులు తయారు చేసుకునేలా చట్టబద్ధంగా అవకాశం కల్పించాలని కోరారు.  ఈ ప్రక్రియ ద్వారా గిరిజనులకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం అమలు చేసే వరకు గిరిజన సంఘం తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ప్రకాష్, గేమిసింగ్, నాజం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -