రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి. తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. వీడియోలో 'నాకు ఒకే ఒక్క కూతురే... పేరు మనమ్మ అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తిని మరింత పెంచారు.
ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది.
రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీఓపీ: విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి.
‘ఇరుముడి` డబ్బింగ్ షురూ..
- Advertisement -
- Advertisement -



