Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

- Advertisement -

మోడీ పాలనలో లీక్‌లు, అవినీతే తప్పా అభివృద్ధి లేదు : సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళనలు
నవతెలంగాణ-విలేకరులు
నీట్ పేపర్ లీకేజీతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర వి ద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), సీఐటీయూ, ఎస్‌ఎ‌ఫ్‌ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట, ప్రధాన కూడళ్ల వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మోడీ పాలనలో లీకులు, అవినీతి తప్పా అభి‌వృద్ధి లేదని నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రశ్నించే గొం తులపై నిర్బంధాన్ని ఆపాలని, పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలో నిరసన కార్యక్ర మాలు నిర్వహించారు. వనపర్తి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జోగులాంబ గద్వాల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద, వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డులోని తెలంగాణ చౌక్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎఫ్‌సీఐ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఎస్‌ఎ‌ఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లగొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్‌‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) ఖమ్మం త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -