Wednesday, July 22, 2026
E-PAPER
Homeసినిమాఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

- Advertisement -


తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర హీరో విజయ్‌ నటించిన ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఈనెల 23న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులను ముందుగానే ఊహించాం. విజయ్ కూడా, ‘ఇది నా చివరి సినిమా. దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తు న్నాను. అందువల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది` అని ముందే చెప్పారు. కానీ మేము ఊహించని కొన్ని పరిస్థితులు వచ్చాయి. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు 23కి వచ్చింది. మొత్తంగా చూస్తే రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు… ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అసలు ఊహించలేదు. కాకపొతే ఇందులో మంచిని కూడా చూడాలంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది. అది అభిమానులకు మరింత ఉత్సాహం ఇస్తుంది.
ఇది నా తొలి తమిళ సినిమా. ‘భగవంత్ కేసరి’ సినిమా విజయ్ కి చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. అందులోని రెండు సన్ని వేశాలను మాత్రమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందిం చాం. ఈ విషయంపై దర్శకుడు అనిల్ తో కూడా మాట్లాడాం. అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయాలనే థ్రెడ్ తప్పితే మిగతా దంతా పూర్తిగా కొత్త కథ. ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా ఇది.
నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి మీద చాలా అభిమానం. ఆయన సినిమాలు, ఆయన ప్రయాణం నాకు స్ఫూర్తి. అందుకే నేను తెలుగులో సినిమా చేస్తే మొదట చిరంజీవి తోనే చేయాలని ముందే నిర్ణయించు కున్నాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -