- Advertisement -
నవతెలంగాణ క్రికెట్ పోటీలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు మంగళవారం చిరుజల్లుల మధ్య ఉల్లాసంగా..ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. క్రీడల్లో భాగంగా రెండో రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఎడిటోరియల్ బోర్డు, ఎన్‌టీపీపీ-1, అడ్మినిస్ర్టేషన్, వెబ్ టీమ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. హెచ్‌ఆర్ జీఎం నరేందర్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
- Advertisement -



