Wednesday, July 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతులను తప్పుదోవ పట్టించొద్దు

రైతులను తప్పుదోవ పట్టించొద్దు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ మంత్రి హరీశ్‌‌రావు రైతులను తప్పుదోవ పట్టించే ‌రాజకీయాలు మానుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుపై దుష్ర్పచారం మాని, కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్‌ను మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్‌‌ను ఎందుకు చేర్చారో చెప్పాలంటూ నిలదీశారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు చెల్లించారని కవిత చేసిన ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద మంగళవారం నుంచే 9 పంపింగ్
యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పంపులను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -